Wednesday, June 24, 2009

పల్లకి మోసేవారు కావలెను

ఇది శ్రీశ్రీ శత జయంతి సంవత్సరం,
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు..
అని అడిగిన మహాకవి.
భారత దేశం లో అన్నీ వింత గా కనబడతాయ్. రాజులుండనిది,వారసత్వం కానిది ప్రజాస్వాంయం అని డంకా బజాయించి చెబుతాం.
ఎన్నికలొచ్చాయంటే వారి పెట్రోలు డీజిల్ వాహనాలన్ని ప్రచార రధాలు గా మారిపోతాయ్.కత్తులు,ఖడ్గాలు కిరీటాలు బహుమతులు గా ఇస్తారు,తీసుకుంటారు.
డప్పుకొట్టే, బ్యానర్ కట్టే అభిమానం చూపిన పల్లకీ మోత గాల్లు తప్పు కొంటే ఏమవుతుందో,అష్టాదశ ఫ్రేముల్లో ఇమిడిపోయి కనబడుతుంది.మోసే వాడికి బుర్ర ఉందోయ్,గుర్రు ..గుర్రు .కూడా ఉందోయ్.ఈ రాజ్యం వదలి వేరే రాజు పంచన చేరే వంచకులను కూ డా గుర్తించే కాలం వచ్చేసిందోయ్.