Saturday, July 4, 2009

భారత మాత కు మరో రేపు కొవ్వూరు

ఈ గడ్డ పై ఏ స్త్రీ పైన జరిగే అఘాయిత్యమైనా,అత్యాచారమైనా భారత మాతకు జరిగినట్లే.
సినీ నటి ప్రత్యూష..
విజయవాడ ఆయేషా...
వాకపల్లి గ్యాంగ్ రేప్ కు గురైన అమాయక భారతమాతలు..
కొవ్వూరు నర్సింగ్ కాలెజీ విద్యార్థునులు..

వీటన్నిటి వెనుక ఉన్న సమానాంశం అబలలపై దాడి చేస్తున్న "పవర్",చూస్తున్న ప్రభుత్వాలు.

తప్పుచేసినవాడికి శిక్ష పడని రోజుల్లో ఉన్నామనేది స్పష్టమా?

అంటే భారతమాతపై జరిగే ప్రతి అత్యాచారాన్ని చూస్తున్నాం.మనల్ని మన్మే చెరచుకుంటుంన్నాం.మనది నాగరిక సమాజమా?
కొవ్వూరు కథ మొదటినుండి తప్పించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడ "దళిత కార్డు".దళిత అనేది నేరం నుండి తప్పించుకోవడానికి కాదు,దళిత సమస్యలపై పోరాడాడానికి స్వాతంత్రమొచ్చి అరవైరెండు ఏళ్ళు గడిచింది ఐనా ఏ దళిత నాయకుడికి కానరానిది,పోరాడనివి రెండు ఉన్నాయ్
ఒకటీ : ప్రభుత్వం ఉచితం గా ఇచ్చే పాట్య పుస్తకాలు స్కూళ్ళు తెరిచేనాటికి కావాలనే సిద్ధం కావు. దానితో పుస్తకాలు కొనుక్కోలేని పేద విధ్యార్థి సుమారు రెండు నెలలు సాటీ విధ్యార్థుల మద్య క్షోభ అనుభవిస్తాడు.

రెండూ : సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కి చలికాలానికి దుప్పట్లకి సంవత్సరం ముందు ఆర్డర్స్ ఇచ్చిన చలికాలానికి ఓ-ఆప్టెక్స్ వాడూ సప్పై చేయడు.ఓ-ఆప్టెక్సు పై చర్య ఏ జన్మకూ తీసుకోరు,"దళిత ,దళిత "అనే ఏ నాయకుడూ కి కూడా ఇవి కాన రావు.
మూడు : సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ ఎవరి ఇల్లైనా ఇంధ్ర భవనమే..ఇదీ ఏ దళిత నాయకుడికి పట్టదు.
సమస్యల పోరాడా దానికి "దళిత" ,నేరాలనుండి తప్పించుకోవడానికి కాదని ఈ కొవ్వూరు ఉదంతపు తీర్పు నిరూపించాలి.
యత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవతా రమంతే...
ఈ గడ్డ పై జరుగుతున్నవి చూడాలేక దేవతలు ఎప్పూడో పారి పోయారు.